BJP: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కు సవాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్యే అనిత

  • టీడీపీతో కలిసి ఉండడం వల్లే బీజేపీకి ఆ సీట్లైనా వచ్చాయి
  • మంత్రి వర్గం నుంచి బయటకు వెళ్లడమనేది వారి సొంత నిర్ణయం
  • చంద్రబాబును విమర్శించే స్థాయి ఎమ్మెల్సీ మాధవ్ కు లేదు
మిత్రపక్షమైన బీజేపీ తమను ఎన్ని అవమానాలకు గురి చేసినా ఇన్నాళ్లూ భరిస్తూ వచ్చామని టీడీపీ ఎమ్మెల్యే అనిత విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, టీడీపీతో కలిసి ఉండడం వల్లే బీజేపీకి ఆ మాత్రమైనా సీట్లు వచ్చాయని, మంత్రి వర్గం నుంచి బయటకు వెళ్లడమనేది వారి సొంత నిర్ణయమని అన్నారు. సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కు లేదని, దమ్ముంటే, తన పదవికి రాజీనామా చేసి టీడీపీ మద్దతు లేకుండా గెలవాలని అనిత సవాల్ విసిరారు.
BJP
Telugudesam

More Telugu News