రెండో పార్ట్ పూర్తి కాకుండానే మూడో పార్ట్ కూడా ప్రకటించేసిన 'బాఘీ' చిత్రయూనిట్!
- మంచి వసూళ్లు సాధించిన 'బాఘీ'
- 'వర్షం' సినిమాకి రీమేక్ గా 'బాఘీ'
- 'క్షణం' రీమేక్ గా 'బాఘీ 2'
దీంతో దానికి సీక్వెల్ ను చిత్రయూనిట్ రూపొందిస్తోంది. ఈ సినిమా కూడా తెలుగు సినిమా 'క్షణం'కి రీమేక్ కావడం విశేషం. ఈ సినిమాకి బాలీవుడ్ ప్రముఖ కొరియో గ్రాఫర్ అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో టైగర్ సరసన రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్ దిశా పఠానీ నటిస్తోంది. ఇప్పుడు 'బాఘీ 3'ని కూడా తీయనున్నట్టు ఈ చిత్రయూనిట్ ప్రకటించడం విశేషం. ఈ సినిమా హీరో, దర్శకుడు మూడో పార్ట్ కి కూడా పనిచేస్తారు. మిగతా నటీనటులను త్వరలోనే ప్రకటిస్తామని చిత్రయూనిట్ తెలిపింది. కాగా, ఈ మూడు సినిమాలకి నిర్మాతగా సాజిద్ నడియావాలా వ్యవహరిస్తున్నారు.