Andhra Pradesh: బీజేపీ, జగన్ మధ్య రహస్య ఒప్పందం ఉందేమో అనుమానంగా ఉంది: మంత్రి చినరాజప్ప

  • జగన్ ఎప్పుడూ బీజేపీని విమర్శించడు
  • బీజేపీ నేతలు కూడా జగన్ పై కామెంట్ చేయరు
  • బీజేపీ మంత్రుల రాజీనామాలు వారి ఇష్టం
బీజేపీ, జగన్ మధ్య రహస్య ఒప్పందం ఏమైనా ఉందేమోనని అనుమానంగా ఉందని ఏపీ హోమ్ శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఎప్పుడూ బీజేపీని విమర్శించడని, అలాగే, బీజేపీ నేతలు కూడా జగన్ పై ఎప్పుడూ కామెంట్ చేయరని, అందుకే, వారి మధ్య రహస్య ఒప్పందం ఏమైనా ఉందేమోననే అనుమానం కలుగుతోందని అన్నారు.

జగన్ అవిశ్వాసం అన్నప్పుడు కూడా బీజేపీ నేతలు మాట్లాడడం లేదని, బీజేపీ మంత్రులు రాజీనామాలు చేసే విషయం వారి ఇష్టమని చెప్పిన చినరాజప్ప, తాము ఇప్పటికీ మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నామని మరోమారు స్పష్టం చేశారు. 
Andhra Pradesh
china rajappa

More Telugu News