rani mukharji: అతడు ప్రేమతో చేసే పనులు చూసి తిడతాను: భర్త గురించి రాణి ముఖర్జీ

షార్ట్స్‌లో చూడండి
త‌న భ‌ర్త‌, యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ అధినేత ఆదిత్య చోప్రా త‌న ప‌ట్ల చూపించే ప్రేమ ప‌ట్ల బాలీవుడ్ న‌టి రాణి ముఖ‌ర్జీ పొంగిపోతోంది. వారిద్ద‌రికీ నాలుగేళ్ల క్రితం పెళ్లి కాగా, వారి అన్యోన్య దాంప‌త్యానికి చిహ్నంగా రెండేళ్ల కూతురు ఉంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... త‌న భ‌ర్త త‌న ప‌ట్ల‌ ప్రేమతో చేసే పనులను చూసి ఆయ‌న‌ను తిడతానని, కానీ త‌న తిట్ల‌లో ప్రేమ తప్ప ద్వేషం ఉండదని చెప్పింది.

తాను ఎవరినైనా తిట్టానంటే, వారిని తాను నిజంగా ప్రేమిస్తున్నట్లు అని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం రాణి ముఖ‌ర్జీ ‘హిచ్‌కీ’ అనే సినిమాలో న‌టిస్తోంది. పెళ్లి త‌రువాత న‌ట‌న‌కు దూరంగా ఉంటోన్న ఆమె ఈ సినిమా ద్వారా మ‌ళ్లీ ఎంట్రీ ఇస్తోంది. 
Go Back to Shorts
rani mukharji
Bollywood
scold

More Telugu News