Gunduhanumantharao: గుండు హనుమంత రావు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేసీఆర్!

  • ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి
  • సినీ, టీవీ, రంగస్థలం ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న హనుమంత రావు
  • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ముఖ్యమంత్రి
ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంత రావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హనుమంత రావును కాపాడడానికి వైద్యులు, బంధుమిత్రులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడం బాధాకరమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ, టీవీ, రంగస్థలం ద్వారా తన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న హనుమంత రావు మరణం తీరని లోటు అని సీఎం అభిప్రాయపడ్డారు.
Gunduhanumantharao
KCR
Tollywood

More Telugu News