చిరూ కథానాయికలలో నయనతారకే ఫస్టు ప్లేస్!
- చిరూకి విపరీతమైన క్రేజ్
- ఆయన జోడీలుగా మెప్పించినవారు కొందరే
- వాళ్లలో ప్రత్యేక స్థానంలో విజయశాంతి
ఆ తరువాత చాలాకాలానికి ఆ పారితోషికం రికార్డును కాజల్ క్రాస్ చేసింది. 'ఖైదీ నెంబర్ 150' సినిమా కోసం ఆమె 2 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్టుగా సమాచారం. ఇప్పుడు ఈ రికార్డు కూడా చెరిగిపోయిందని తెలుస్తోంది. చిరంజీవి 'సైరా' సినిమాకోసం పారితోషికంగా నయనతారకి 3 కోట్లను ఇస్తున్నారట. తెలుగు .. తమిళ భాషల్లో ఆమెకి గల క్రేజ్ అందుకు కారణమని చెబుతున్నారు. ఇలా చిరూ కథానాయికలలో పారితోషికం పరంగా నయనతారదే ఫస్టు ప్లేస్ అని అంటున్నారు. ఇప్పట్లో ఈ రెమ్యునరేషన్ రికార్డును మరో కథానాయిక దాటడం కష్టమేనని చెబుతున్నారు.