West Godavari District: భీమవరం మావుళ్లమ్మకు ఎన్టీఆర్ తల్లి షాలిని వెండి కానుక!

  • భీమవరం గ్రామదేవత మావుళ్లమ్మ
  • ఆలయాన్ని సందర్శించిన షాలిని
  • ప్రత్యేక పూజలు చేయించిన అర్చకులు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో గ్రామదేవతగా విలసిల్లుతున్న మావుళ్లమ్మ ఆలయాన్ని సందర్శించిన హీరో ఎన్టీఆర్ తల్లి షాలిని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వెండి కానుకను అందించారు. తన స్నేహితులతో కలసి ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా అమ్మవారికి షాలిని 350 గ్రాముల బరువైన వెండి పాత్రను కానుకగా అందించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించిన పురోహితులు ఆశీర్వచనం చదివారు. షాలినీ వచ్చారని తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు పలువురు గుడి వద్దకు రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.
West Godavari District
Bhimavaram
NTR
Shalini
Mavoollamma

More Telugu News