Rajendra Prasad: "నా దురదృష్టం... ఏవీఎస్, ధర్మవరపు, ఎంఎస్... నేడు గుండు... అందరం వెళ్లిపోవాల్సిందే": రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగం

  • దాదాపు 50కి పైగా సినిమాల్లో కలసి నటించాం
  • సోదరుడి వంటి వాడిని కోల్పోయాను
  • మనసుకు నచ్చిన వ్యక్తి గుండు: రాజేంద్ర ప్రసాద్
ఈ తెల్లవారుజామున మరణించిన గుండు హనుమంతరావు కుటుంబీకులను పరామర్శించిన అనంతరం నటుడు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, గుండుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాయలోడు, పేకాట పాపారావు, హైహై నాయకా, కొబ్బరి బొండాం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తాము కలసి నటించామని, తాను హీరోగా చేసిన దాదాపు 50 సినిమాల్లో గుండు హనుమంతరావు నటించి మెప్పించారని అన్నారు.

 "నా దురదృష్టం... ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ వంటి వారిని కోల్పోయాను. ఇవాళ మరొక... నా సోదరుడి వంటి వాడిని కోల్పోయాను. అందరమూ వెళ్లిపోవాల్సిందే. ఇక్కడ ఎవరమూ పర్మినెంట్ కాదు. కాకపోతే... మనసుకు నచ్చిన వ్యక్తి గుండు హనుమంతరావు. నటుడిగా కన్నా మంచి వ్యక్తిగా నాకు తెలుసు" అని భావోద్వేగంతో మాట్లాడారు.
Rajendra Prasad
Gundu Hanumanta Rao

More Telugu News