Kamineni Srinivas: బీజేపీ మంత్రుల రాజీనామా ప్రస్తావన రాగానే వెళ్లిపోయిన మంత్రి కామినేని... కారణం ఇదే!

  • నిన్న విజయవాడలో బీజేపీ కీలక భేటీ
  • మధ్యలోనే లేచి వెళ్లిపోయిన మంత్రి కామినేని
  • ఆరోగ్యం బాగాలేదని వివరణ ఇచ్చిన మంత్రి
  • అధిష్ఠానం ఏం చెబితే అదే చేస్తానన్న కామినేని
నిన్న విజయవాడలో బీజేపీ పథాధికారుల సమావేశంలో టీడీపీతో పొత్తుపై వాడీవేడీ చర్చలు జరుగుతున్న వేళ, ఏపీ ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాలరావుల రాజీనామాపై నేతలు మాట్లాడుతుండగా, కామినేని మధ్యలోనే లేచి బయటకు వెళ్లిపోయారంటూ వార్తలొచ్చాయి. ఈ క్రమంలో తాను ఎందుకు మధ్యలోనే వెళ్లిపోయానన్న విషయమై కామినేని ఈ ఉదయం వివరణ ఇచ్చారు.

నిన్న తనకు ఆరోగ్యం బాగాలేదని, అందుకే మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చిందని చెప్పారు. పొత్తుల విషయం తమ పార్టీ అగ్రనాయకత్వం పరిధిలోనిదని, రాష్ట్ర స్థాయిలో తీసుకునే నిర్ణయం కాదని అన్నారు. తాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా నడుచుకుంటానని స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని కామినేని శ్రీనివాస్ తెలిపారు.
Kamineni Srinivas
BJP
Telugudesam

More Telugu News