Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

షార్ట్స్‌లో చూడండి
*  ఎన్ని పాత్రలు పోషిస్తున్నా, తన చిరకాల కోరిక మాత్రం అలాగే వుందని అంటోంది బ్యూటీ క్వీన్ కాజల్ అగర్వాల్. 'పూర్తి యాక్షన్ ప్రధానమైన పాత్ర చేయాలని ఎప్పటి నుంచో వుంది. అంటే ఫైటింగులు చేయాలని వుంది. అయితే, ఇంతవరకు ఆ అవకాశం రాలేదు. వస్తే మాత్రం నా సత్తా చూపిస్తాను' అని చెప్పింది కాజల్.    
*  మెగా హీరో సాయిధరం తేజ్, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనుంది. శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
*  ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న 'మెహబూబా' చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. నిన్నటి నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆకాష్ పూరీ, నేహ శెట్టి ఇందులో జంటగా నటించారు. ఈ వేసవి సెలవుల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.          
*  యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా రవిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇదిలా ఉంచితే, ప్రస్తుతం రాజ్ తరుణ్ 'రాజుగాడు' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే.
Go Back to Shorts
Kajal Agarwal
sai
Poori
rajTarun

More Telugu News