Andhra Pradesh: బీజేపీ పథాధికారుల సమావేశంలో సంచలన నిర్ణయాలు!
- మిత్ర ధర్మానికి టీడీపీ తూట్లు పొడిచింది
- ఏపీలో బీజేపీని ముద్దాయిని చేసింది
- టీడీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- ఏపీలో ఉన్న రెండు మంత్రి పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయం!
విజయవాడలో ఈరోజు జరిగిన బీజేపీ పథాధికారుల సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. బీజేపీకి పదవులు తృణప్రాయమని, ఏపీలో ఉన్న రెండు మంత్రి పదవులకు రాజీనామా చేయాలని, ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానం చేసినట్టు సమాచారం. మిత్ర ధర్మానికి టీడీపీ తూట్లు పొడిచిందని, ఏపీలో బీజేపీని ముద్దాయిని చేసింది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
టీడీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకుగాను, సీడీలు తయారు చేసి నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షపాత్ర పోషించాలని, 2014లో టీడీపీ ఇచ్చిన హామీలపై ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించినట్టు సమాచారం.