rajanikanth: కమల్ ని అభినందించిన రజనీకాంత్!
తమిళనాడులో త్వరలో తన పర్యటన ప్రాంభించనున్న ప్రముఖ నటుడు కమలహాసన్ ఈరోజు రజనీకాంత్ ని ఆయన నివాసంలో కలిశారు. తన నివాసానికి వచ్చిన కమల్ ని ఆప్యాయంగా రజనీకాంత్ ఆహ్వానించారు. త్వరలో పర్యటన ప్రారంభించనున్న కమల్ ని రజనీ అభినందించారు. సమావేశానంతరం మీడియాతో రజనీ కాంత్ మాట్లాడుతూ, సినిమాలు, రాజకీయాల్లో తమ దారులు వేరని, ఇద్దరి దారులు వేరైనప్పటికీ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తున్నామని అన్నారు.