bjp: బీజేపీ, వైసీపీపై మంత్రి నారాయణ ఆగ్రహం

  • విభజన చట్టాన్ని అమలు చేయడంలో బీజేపీ అలసత్వం తగదు
  • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
  • కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాం
  • పిల్ల కాంగ్రెస్ రాజీనామా డ్రామాలాడుతోంది: నారాయణ
బీజేపీ, వైసీపీపై ఏపీ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన చట్టం ఆమోదానికి సహకరించిన పార్టీ, చట్టాన్ని అమలు చేయడంలో అలసత్వం చూపడం దారుణమని, బీజేపీ తమ మిత్రపక్షమైనా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని నారాయణ స్పష్టం చేశారు.

ఏపీకి న్యాయం జరుగుతుందని చివరి బడ్జెట్ వరకు ఎదురుచూశామని, అయినా ఫలితం లేదని, అందుకే, కేంద్రంపై ఇప్పుడు ఒత్తిడి పెంచుతున్నామని అన్నారు. మధ్యంతర ఎన్నికలు రావని తెలిసే పిల్ల కాంగ్రెస్ రాజీనామా డ్రామాలు ఆడుతోందని, వైసీపీ నిజాయతీగా వ్యవహరించకపోతే ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని విమర్శలు గుప్పించారు.
bjp
YSRCP
narayana

More Telugu News