ESL Narasimhan: నాలో నరుడు, నరసింహుడూ ఇద్దరూ ఉన్నారు: గవర్నర్ నరసింహన్ నోట ఆశ్చర్యకర వ్యాఖ్య
తనలో నరసింహుడు కూడా ఉన్నాడని, కానీ తాను నరుడిగా మాత్రమే వచ్చానని, నరసింహుడిని బయటకు చూపడం లేదని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన చెప్పిన మాటలు ఆహూతులను ఆశ్చర్యపరిచాయి. ఇండియన్ స్పోర్ట్స్ మెడిసిన్ ఇనిస్టిట్యూట్ స్పార్క్ ట్రస్ట్ 13వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఆయన, 22 మందికి 'ప్రైడ్ ఆఫ్ ఇండియా' పురస్కారాలను అందించారు.
టీ నగర్ లోని కర్ణాటక సంఘం ఆడిటోరియంలో ఇది జరుగగా, ఎప్పుడూ గంభీరంగా కనిపించే నరసింహన్, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతూ చేసిన ప్రసంగం ఆహూతులను అలరించింది. ట్రస్టు నిర్వాహకుడు డాక్టర్ కన్నన్ పుహళేంది మాట్లాడుతూ, 'గవర్నర్ అంటే గంభీరంగా ఉంటారని అనుకుంటాం, కానీ నరసింహన్ చాలా సరదాగా ఉన్నారు' అని అనగానే, మరోసారి మైక్ అందుకున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపై ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది.