ఏపీ దుస్థితికి జైరామే కారణం : యనమల ధ్వజం
- జైరామ్ విభజన చట్టం ఘోస్ట్ రైటరని మండిపాటు
- పోలవరంపై తప్పుడు ఆరోపణలు చేయొద్దని హితవు
- ఆధారాలుంటే చూపాలని మంత్రి సూచన
ఉద్దేశ్యపూర్వకంగానే లోపభూయిష్టమైన చట్టం చేసి ఏపీకి తీరని అన్యాయం చేశారని ఆయన దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుపై జైరామ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యనమల ఈ మేరకు ధ్వజమెత్తారు. జైరామ్ తప్పుడు ఆరోపణలు చేయడం మాని ఆధారాలుంటే బయటపెట్టాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజన సమయంలో జైరామ్ డ్రామాను ప్రజలు మరిచిపోలేదని, విభజన కపట నాటక సూత్రధారి ఆయనేనని నిప్పులు చెరిగారు. విభజన చట్టంలో మార్చలేనన్ని తప్పులు చేసి ఇప్పుడు మార్చమని చెప్పడాన్ని యనమల తీవ్రంగా తప్పుబట్టారు.