Iphone: ఆ తెలుగు 'కీటకం'ను నాశనం చేస్తాం: యాపిల్ హామీ

  • ఐఫోన్లకు నష్టాన్ని కలిగిస్తున్న 'జ్ఞా'
  • అక్షరం వచ్చిన మెసేజ్ చూస్తే ఫోన్లన్నీ నాశనం
  • అతి త్వరలో సమస్య పరిష్కారం
  • పనులు ప్రారంభించామన్న యాపిల్
యాపిల్ ఐ ఫోన్లలోని సమస్త సమాచారాన్నీ నాశనం చేస్తున్న తెలుగు బగ్ 'జ్ఞా' అనే అక్షరం సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తామని యాపిల్ ప్రకటించింది. ఐఓఎస్ 11.2.5లో 'జ్ఞా' అనే అక్షరం తీవ్రమైన సమస్యలను కలిగిస్తోందని, దీన్ని ఫిక్స్ చేసే పనులు ప్రారంభించామని తెలిపింది.

కాగా, 'జ్ఞా' అనే తెలుగు అక్షరం ఉన్న మెసేజ్ ని ఓపెన్ చేస్తే, మెసింజర్, వాట్స్ యాప్, మెసేజ్ లతో పాటు మిగతా యాప్స్ సైతం పని చేయకుండా చేస్తుందన్న సంగతి తెలిసిందే. "యాపిల్ ఫోన్ల కోసం ఐఓఎస్ 11కు సరికొత్త అప్ డేట్ ను ఇవ్వబోతున్నాం. ఇది వేసవిలో వచ్చే సరికొత్త 11.3 వర్షన్ తో పోలిస్తే ముందే అందుబాటులోకి వస్తుంది" అని యాపిల్ స్పష్టం చేసినట్టు టెక్ వెబ్ సైట్ 'ది వర్జ్' వెల్లడించింది.
Iphone
Telugu Letter
Bug
Apple

More Telugu News