Hyderabad: హైదరాబాద్ చట్నీస్ లో భారీ అగ్ని ప్రమాదం!

  • కూకట్ పల్లి శాఖలో అగ్నిప్రమాదం
  • బయటకు పరుగులు పెట్టిన కస్టమర్లు
  • మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు
హైదరాబాద్ కూకట్ పల్లిలో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ చట్నీస్ లో కొద్దిసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం పూట రెస్టారెంట్ తెరిచిన తరువాత ఈ ప్రమాదం జరగడంతో ప్రాణభయంతో హోటల్ నుంచి కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ప్రమాదంలో ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు. ఏ మేరకు ఆస్తినష్టం జరిగిందన్న వివరాలు తెలియాల్సి వుంది.
Hyderabad
Kukatpalli
Chutnees
Fire Accident

More Telugu News