NTR: మరోసారి తండ్రి కాబోతున్న ఎన్టీఆర్!

  • ఇప్పటికే ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు నాలుగేళ్ల అభయ్ రామ్
  • మరో బిడ్డకు తల్లికానున్న ప్రణతి
  • త్వరలోనే అధికారిక ప్రకటన
ఈ సంవత్సరం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు తనకు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించిన రాజమౌళి చిత్రంలోనూ నటించనున్న ఎన్టీఆర్ కు మరింతగా ఆనందాన్ని కలిగిస్తున్న విషయమిది. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గర్భవతిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు నాలుగేళ్ల కుమారుడు అభయ్ రామ్ ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఇక ప్రణతి మరో బిడ్డకు తల్లి కానుందన్న విషయమై అతి త్వరలోనే ఎన్టీఆర్ స్వయంగా అధికారిక ప్రకటన చేయనున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
NTR
Pranati
Pregnent
Trivikram Srinivas
Rajamouli

More Telugu News