Amrapali: పెళ్లికూతురిగా మెరిసిపోతోన్న కలెక్టర్‌ ఆమ్రపాలి ఫొటోలు వైరల్!

  • రేపు ఆమ్రపాలి పెళ్లి
  • జమ్ముకశ్మీర్‌లో ఒక్కటి కాబోతోన్న సమీర్‌ శర్మ, ఆమ్రపాలి జంట
  • ఈ నెల‌ 23న వరంగల్‌లో, 25న హైదరాబాద్‌లో విందు
వరంగల్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి పెళ్లి కూతురిగా ముస్తాబయ్యారు. జమ్మూ కశ్మీర్ లో రేపు ఐపీఎస్‌ అధికారి సమీర్‌ శర్మతో ఆమె ఏడు అడుగులు వేయనున్నారు. పెళ్లికి ఒక్కరోజు ముందు ఆమెను సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురిలా ముస్తాబు చేసిన‌ట్లు తెలుస్తోంది. వీరి వివాహ విందును ఈ నెల‌ 23న వరంగల్‌లో, 25న హైదరాబాద్‌లో నిర్వ‌హించ‌నున్నారు. హనీమూన్‌ కోసం వీరు ఈ నెల‌ 26న టర్కీకి వెళ్లనున్నారు. వ‌చ్చేనెల‌ 7 వరకు ఆమ్రపాలి దంపతులు అక్కడే గడుపుతారు.  
Amrapali
District Collector
marriage

More Telugu News