BJP: కేంద్ర ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో రేపు ఏపీ రాష్ట్ర బీజేపీ నేతల సమావేశం!

  • విజయవాడలో సమావేశం
  • పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్న నేతలు
కేంద్ర ఆర్థిక బ‌డ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని రాష్ట్ర రాజకీయ నేతలు, ప్రజలు మండిపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై చర్చించడానికి ఏపీ బీజేపీ నేతలు రేపు విజయవాడలో సమావేశం కానున్నారు. నగరంలోని ఐలాపురం హోటల్‌లో బీజేపీ నేత సతీశ్‌ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆఫీస్‌ బేరర్లు, జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల నేతలు పాల్గొననున్నారు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందని వస్తోన్న విమర్శలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు.   
BJP
Andhra Pradesh
Vijayawada
Union Budget 2018-19

More Telugu News