markram: విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌

  • కోహ్లీ ఆటతీరు అద్భుతంగా ఉంది-మార్క్‌రమ్‌
  • ఆట పట్ల కోహ్లీకి ఉన్న అంకిత భావం ఆశ్చర్యపరిచింది
  • జట్టు విజయం కోసం కోహ్లీ కృషి చాలా బాగుంది
  • అందుకే ఆయనను ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అని అంటారేమో
భారత క్రికెట్ జట్టును విరాట్ కోహ్లీ విజయవంతంగా నడిపిస్తోన్న తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. చివరకు దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ మార్‌క్రమ్ కూడా కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. తాను విరాట్‌ కోహ్లీని చూసి చాలా నేర్చుకున్నానని అన్నాడు. కోహ్లీ ఆటతీరు అద్భుతంగా ఉందని, ఆట పట్ల అతనికి ఉన్న అంకిత భావం తనను ఆశ్చర్యపరిచిందని మార్‌క్రమ్ వ్యాఖ్యానించాడు.

జట్టు విజయం కోసం కోహ్లీ కృషి చాలా బాగుందని, అందుకే ఆయనను ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అని అంటారేమోనని అన్నాడు. ఈ సిరీస్‌ ఓటమి తనకు చాలా నేర్పిందని, ఒత్తిడిని ఎలా అధిగమించి ఆడాలో తెలిసిందని తెలిపాడు.
markram
Cricket
Virat Kohli

More Telugu News