Pawan Kalyan: ఎంపీలు సరిగా పనిచేయకపోవడం వల్లే ప్రత్యేక హోదా రాలేదు: పవన్‌ కల్యాణ్‌ విమర్శలు

  • ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మభ్యపెట్టారు
  • ప్రత్యేక హోదా అనేది ఎవరి వ్యక్తిగత సమస్య కాదు
  • కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఎంపీలు ఎందుకు భయపడ్డారో తెలియడం లేదు
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీల అమలు విషయంలో ఇలాగే మభ్యపెడితే ప్రజల్లో విసుగు వచ్చేస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మభ్యపెట్టారని అన్నారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు సరిగా పనిచేయకపోవడం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని వ్యాఖ్యానించారు.

ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఎవరి వ్యక్తిగత సమస్య కాదని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఎంపీలు ఎందుకు భయపడ్డారో తెలియడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయవచ్చని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చని అన్నారు. మరోవైపు తెలంగాణ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంకా కొన్ని నెరవేర్చలేదని తెలిపారు. 
Pawan Kalyan
Jana Sena
Special Category Status

More Telugu News