KCR: నేడు సీఎం కేసీఆర్ బర్త్ డే..శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

షార్ట్స్‌లో చూడండి
నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ లు, బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, రోగులకు పండ్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేయనున్నారు.

 ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్, నెక్లెస్ రోడ్డులో భారీగా ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ యువజన విభాగం, టీఆర్ఎస్వీ సంయుక్తంగా ఈరోజు ఉదయం రక్తదాన శిబిరం, కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో మధ్యాహ్నం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు.

శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్


ఢిల్లీ పర్యటన ముగించుకున్న  సీఎం కేసీఆర్ నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు.  అనంతరం, రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ ని కలిశారు. దాదాపు గంటపాటు వారు సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటన, ఇతర అంశాలపై వారు చర్చించారు. కేంద్రబడ్జెట్ లో తెలంగాణకు ఒక్కటీ సానుకూలంగా లేదని గవర్నర్ తో కేసీఆర్ అన్నట్టు సమాచారం. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు నరసింహన్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
KCR
narasimhan

More Telugu News