Rahul Gandhi: కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ!

  • సీడబ్ల్యూసీ రద్దు
  • వచ్చేనెలలో ప్లీనరీ సమావేశాలు 
  • సాహసోపేత నిర్ణయమంటోన్న విశ్లేషకులు
కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల‌ని యోచిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయీకరణ వ్యవస్థగా పేరొందిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ర‌ద్దు చేశారు. మార్చి రెండో వారంలో ఆ పార్టీ ప్లీనరీ సమావేశాలు ఢిల్లీలో జరగనున్నాయి. ఆ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రులు చిదంబరం, గులాం నబీ ఆజాద్, జనార్దన్ ద్వివేదీ పాల్గొంటారు. అందులో మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు.     
Rahul Gandhi
Congress
cwc

More Telugu News