Allu Arjun: అల్లు అర్జున్‌ తనను ప్రశంసించాడని.. పొంగిపోతున్న ఇంటర్నెట్ సంచలనం ప్రియ ప్రకాశ్‌!

  • ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియా ప్రకాశ్
  • అల్లు అర్జున్‌ ఇచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను
  • కేరళలో ఆయనకు అభిమానులు ఎక్కువ
ఇంట‌ర్నెట్‌లో విపరీతంగా పాప్యులారిటీ సంపాదించుకున్న మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌ను పలువురు ప్రముఖులు కూడా కొనియాడిన విషయం తెలిసిందే. ఆమెను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. మలయాళ సినీ పరిశ్రమలో అల్లు అర్జున్‌కి చాలా పాప్యులారిటీ ఉంది. స్టైలిష్ స్టార్ చేసిన ట్వీట్‌పై ప్రియా ప్రకాశ్ హర్షం వ్యక్తం చేసింది.

ప్రియతో పాటు ఆమె సహ నటుడు రోషన్‌ అబ్దుల్‌ రహూఫ్‌తో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియా మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ ఇచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ  మర్చిపోలేనని తెలిపింది. అభిమానుల నుంచి తనకు ఇంతటి ఆదరణ లభించినా, అల్లు అర్జున్‌ ఇచ్చిన కాంప్లిమెంట్ చాలా ప్రత్యేకమైనదని, తమ రాష్ట్రంలో ఆయనకు అభిమానులు ఎక్కువని చెప్పింది.

Allu Arjun
priya prakash
internet
star

More Telugu News