Kamal Haasan: తమిళనాడుకు కావేరీ జలాల వాటా తగ్గిపోవడంపై నేనూ ఆశ్చర్యపోయా!: కమలహాసన్

  • సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుంటా
  • కావేరీ జలాలపై ఏ ఒక్క రాష్ట్రానికీ పూర్తి హక్కులేదన్న వ్యాఖ్యలు ఊరట నిచ్చాయి
  • మీడియాతో కమలహాసన్
కావేరీ నదీ జలాల వివాదం విషయంలో ఈ రోజు వెలువడిన సుప్రీం తీర్పుపై ప్రముఖ నటుడు కమలహాసన్ స్పందించారు. ఈ మేరకు ఆంగ్ల మీడియాతో ఆయన మాట్లాడుతూ, తమిళనాడుకు రావాల్సిన కావేరీ జలాల వాటాను తగ్గించడంపై తాను కూడా ఆశ్చర్యపోయానని, ఇందుకు సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుంటానని అన్నారు. కాగా, తమిళనాడుకు న్యాయబద్ధంగా ఏటా 177.25 టీఎంసీలు కేటాయిస్తూ, కర్ణాటకలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మరో 14.75 టీఎంసీల నీటిని ఆ రాష్ట్రం వాడుకోవచ్చని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది.
Kamal Haasan
Tamilnadu

More Telugu News