jio: రెడ్‌మీ నోట్ 5, రెడ్‌మీ నోట్ 5 ప్రొ లపై జియో బంపర్ ఆఫర్ !

  • గివ్ మి5 ఆఫర్ తో రూ.2200 విలువగల 44 క్యాష్‌బ్యాక్ వోచర్లు
  • ఒక్కో వోచర్ విలువ రూ.50
  • రూ.198 అంతకన్నా ఎక్కువ విలువ గల రీచార్జిపై డబుల్ డేటా
చైనా మొబైల్ దిగ్గజం షియోమి తాజాగా రెడ్‌మీ నోట్ 5, రెడ్‌మీ నోట్ 5 ప్రొ లను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22వ తేదీ నుండి ఇవి అమ్మకానికి రానున్న నేపథ్యంలో ఈ ఫోన్లపై జియో బంపరాఫర్ ప్రకటించింది. ఎవరైతే రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ ఫోన్లను కొని వాటిలో జియో సిమ్ వేసి రూ.198 లేదా రూ.299 ప్లాన్‌లతో మై జియో యాప్‌లో రీచార్జి చేసుకుంటారో వారికి 'గివ్ మి5 ఆఫర్' క్రింద రూ.2200 విలువైన ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ 44 వోచర్ల రూపంలో లభిస్తాయి.

ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉండగా, తరువాత నుంచి చేసుకునే రీచార్జిలపై వీటి డిస్కౌంట్‌ను పొందవచ్చు. రూ.198 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే ఒక్కోసారి 112జీబీ డేటా చొప్పున మొత్తం 3 సార్లకు గాను 336 జీబీ డేటాను వినియోగదారులు పొందుతారు. రూ.198 అంతకన్నా ఎక్కువ విలువ గల రీచార్జి చేసుకుంటే వినియోగదారులు డబుల్ డేటాను పొందుతారు. 
jio
redmi note5
redminote5 pro
offer
giveme5 offer

More Telugu News