tammineni sitaram: ముఖ్యమంత్రి సహా అసెంబ్లీలో అంతా క్రిమినల్సే!: వైసీపీ నేత తమ్మినేని సీతారాం

  • దందాలు చేస్తున్న ప్రజాప్రతినిధులను ప్రజలు ఎలా గౌరవిస్తారు?
  • అసెంబ్లీలో అచ్చెన్నాయుడు తన ఇష్టానుసారం మాట్లాడతారు
  • నేను కనుక అసెంబ్లీలో ఉంటే అచ్చెన్నాయుడు అలా మాట్లాడడు
ముఖ్యమంత్రి సహా అసెంబ్లీలో అంతా క్రిమినల్సే ఉన్నారంటూ ఏపీ వైసీపీ నేత తమ్మినేని సీతారాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఐ డ్రీమ్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా దందాలు చేస్తున్న ప్రజాప్రతినిధులను ప్రజలు ఎలా గౌరవిస్తారని ప్రశ్నించారు. అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు తన ఇష్టానుసారం మాట్లాడతారని, అదే కనుక, తాను అసెంబ్లీలో ఉంటే ఆయన ఆ విధంగా మాట్లాడలేరని తమ్మినేని అన్నారు.

‘నేను కనుక అసెంబ్లీలో ఉంటే అచ్చెన్నాయుడు మాట్లాడడు.. ఇది భగవద్గీత ప్రవచనం.. రాసుకోండి. నా మీద గౌరవంతో అచ్చెన్నాయుడు మాట్లాడకపోవచ్చు. ఒకవేళ ఆయన బాగా మాట్లాడితే ప్రశంసిస్తాం. పనికిమాలిన మాటలు కనుక మాట్లాడితే సభలోనే కడిగిపారేస్తా’ అని అన్నారు.
tammineni sitaram
YSRCP

More Telugu News