Hyderabad: ట్యాంక్ బండ్ కు బయలుదేరిన పవన్... వెంట వందలాది మంది!

  • అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న పవన్
  • ఆపై జేఎఫ్సీ సమావేశ ప్రాంగణానికి
  • జనసేన కార్యాలయం నుంచి కదిలిన పవన్ కాన్వాయ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్యాంక్ బండ్ కు బయలుదేరారు. నేటి నుంచి జేఎఫ్సీ (జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ - సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ) సమావేశాల్లో పాల్గొననున్న ఆయన, అంతకుముందు ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని తెలుసుకున్న ఆయన అభిమానులు ఇప్పటికే ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటుండగా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు జనసేన కార్యాలయం నుంచి వందలాది మంది అభిమానులు కేరింతలతో వెంట కదలగా, పవన్ ట్యాంక్ బండ్ కు బయలుదేరారు. కాగా, మధ్యాహ్నం నుంచి దస్ పల్లా హోటల్ లో జేఎఫ్సీ సమావేశం జరగనుంది.
Hyderabad
Pawan Kalyan
JFC

More Telugu News