Pawan Kalyan: పవన్ తో ఎలా వ్యవహరించాలో నేతలకు స్పష్టం చేసిన చంద్రబాబు!

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడరాదని టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి మంచి చేయాలనేది పవన్ అభిమతమని... మనం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నామని... ఈ నేపథ్యంలో, ఇద్దరి దారీ ఒకటేనని చెప్పారు. పవన్ పట్ల సున్నితంగా వ్యవహరించాలని తెలిపారు. అవసరమైన సమయంలో టీడీపీకి ఆయన అనుకూలంగా ఉంటారని చెప్పారు.

పవన్ ప్రకటించిన జేఎఫ్సీతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. నిధుల గురించి పవన్ శ్వేతపత్రం అడిగితే సున్నితంగా సమాధానం చెప్పాలని సూచించారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను ఇవ్వాల్సింది కేంద్రమేనని... రాష్ట్ర ప్రభుత్వం కాదని చెప్పారు. ఈరోజు జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు సూచనలు చేశారు. 
Go Back to Shorts
Pawan Kalyan
Chandrababu
funds

More Telugu News