డ్రోన్లతో ఫొటోలు తీసి.. 15 రోజులకు ఒకసారి నాకు చూపించండి: చంద్రబాబు ఆదేశం
- అమరావతి పనుల్లో వేగం పెంచండి
- జాప్యం జరిగితే ఉపేక్షించను
- పనులను డ్రోన్లతో చిత్రీకరించండి
సీఆర్డీయే, ఏడీసీ, నిర్మాణ సంస్థల అధికారులు, ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా ఆయన ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సహకారంతో డ్రోన్ల ద్వారా రాజధాని నిర్మాణ పనులను ఫొటోలు తీయించాలని... ప్రతి 15 రోజులకు ఒకసారి వాటిని తనకు చూపించాలని ఆదేశించారు. పనులు సకాలంలో పూర్తయితేనే పెట్టుబడిదారులు ఇక్కడకు వస్తారని చెప్పారు. పనుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా... వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.