Manjula: అదే నా ఆఖరు సినిమా అవుతుంది!: కొడుకు గౌతమ్ ప్రశ్నకు మహేష్ బాబు సరదా సమాధానం!

  • మంజుల దర్శకత్వంలో 'మనసుకు నచ్చింది'
  • హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • పాల్గొన్న టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు
  • ఆసక్తికర విషయం చెప్పిన మంజుల
తాను దర్శకత్వం వహించిన 'మనసుకు నచ్చింది' చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఘట్టమనేని మంజుల, హైదరాబాద్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ కావాలని అడిగిన వెంటనే మహేష్ ఒప్పుకున్నాడని, ఆ తరువాత కొన్ని మార్పులు చెబితే మాత్రం, 'వేరే వాళ్లతో చెప్పించుకో' అని తప్పించుకున్నాడని చెప్పింది.

ఇక ఒకసారి గౌతమ్, "ఆంటీ డైరెక్షన్ లో ఎప్పుడు నటిస్తావు నాన్నా?" అని అడిగితే, "అదే నా అఖరు సినిమా అవుతుంది" అని మహేష్ సరదాగా చెబుతూ తనను ఆట పట్టించాడని మంజుల వెల్లడించింది. ఇక ఇదే కార్యక్రమానికి అతిథిగా వచ్చిన మహేష్ మాట్లాడుతూ, మంజుల ఏదో కాగితాలపై రాసుకుంటుంటే ఏదో కవిత్వమని అనుకున్నానని, తర్వాత సినిమాకు స్క్రిప్ట్ అని తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. భవిష్యత్తులో ఏదో ఒకరోజు మంజుల దర్శకత్వంలో నటిస్తానేమోనని మహేష్ అన్నాడు.
Manjula
Mahesh Babu
Gautam
Tollywood
Manasuku Nachindi

More Telugu News