Newjersy: 'రుచికరమైన చెప్పులు, నోరూరించే చెప్పులు'...: తినేందుకు క్యూ... వీడియో చూడండి!

  • చెప్పుల ఆకారంలో చాక్లెట్లు
  • తయారు చేస్తున్న న్యూజెర్సీ క్యాండీ స్టోర్
  • ఆబగా తినేస్తున్న కస్టమర్లు
నోరూరించే చెప్పులేంటి? వాటిని తినడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే... వాటిని లొట్టలు వేసుకుంటూ తినేయవచ్చు. న్యూజెర్సీలో ఉన్న ఒక స్టోర్‌ ముందు ఇలా కస్టమర్లు చెప్పులను కొనుక్కుని, వాటికి రుచికరమైన క్రీములను రాసుకుని మరీ తినేందుకు బారులు కడుతుంటారు. ఒక క్యాండీ స్టోర్‌ హై‌ హీల్స్ ఆకారంలో చాక్లెట్లను తయారు చేస్తూ విక్రయిస్తుండటంతో, వాటిని జిహ్వచాపల్యం తీరేంతవరకూ తింటూ ఉంటారు. మామూలుగా చూస్తే, ఇవి చాక్లెట్లేనా అన్న అనుమానం వచ్చేలా వీటిని తయారు చేస్తుండటం గమనార్హం. అందుకే వీటికంత డిమాండ్. చాక్లెట్ చెప్పులను ఆబగా తింటున్న వీడియోను మీరూ చూడండి.
Newjersy
Hi Heels
Chocklet

More Telugu News