Andhra Pradesh: ఏపీ బడ్జెట్ 2018-19 కసరత్తు.. రేపటి నుంచి ప్రీబడ్జెట్ సమావేశాలు

  • మూడు రోజుల పాటు జరగనున్న ప్రీ బడ్జెట్ సమావేశాలు
  • హాజరుకానున్న పలు శాఖల మంత్రులు, అధికారులు
  • చివరి రోజున వివిధ శాఖల ఖర్చులు, కేటాయింపులపై చర్చ
 2018-19 ఏపీ బడ్జెట్ పై కసరత్తు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు  నేతృత్వంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. పలు శాఖల మంత్రులు, అధికారులతో నిర్వహించే ప్రీ బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. చివరి రోజు సమావేశంలో వివిధ శాఖల ఖర్చులు, కేటాయింపులపై చర్చ జరగనుంది.

 * మొదటి రోజు.. ఆర్థిక నిపుణులు, మార్కెటింగ్, పౌరసరఫరాలు, పట్టణాభివృద్ధి, రవాణా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, శిశు సంక్షేమ, కార్మిక శాఖల మంత్రులు, అధికారులతో సమావేశం.

*  రెండో రోజు .. నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, రూరల్ హౌసింగ్, ప్రజా సంబంధాలు, రోడ్లు భవనాలు, రెవెన్యూ, పర్యాటక, మైనింగ్, మానవ వనరులు, తదితర శాఖల మంత్రులు, అధికారులతో సమావేశం.

*  మూడో రోజు .. హోం, అటవీ, విద్యుత్, దేవాదాయ, ఆబ్కారీ, పరిశ్రమలు, క్రీడాభివృద్ధి శాఖల మంత్రులు, పలువురు అధికారులతో సమావేశం.
Andhra Pradesh
Yanamala

More Telugu News