Hyderabad: హిందూ సంఘాలకు భయపడి పలుచోట్ల పారిపోయిన ప్రేమికులు!

  • వాలంటైన్స్ డేకు వ్యతిరేకంగా హిందూ సంఘాల నిరసనలు
  • పాశ్చాత్య సంస్కృతి మోజులో పెడదారి పట్టొద్దని సూచన
  • చెన్నైలో వినూత్నంగా నిరసన
  • హైదరాబాద్‌లో ప్రేమికుల దిష్టిబొమ్మ దహనం
మ‌న సంస్కృతి కాని వాలంటైన్స్ డేను జ‌రుపుకుంటూ, గొప్ప నాగరికత అంటూ వెర్రితలలు వేసేలా ప్రవర్తిస్తే ఊరుకోబోమని హిందూ సంఘాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన భజరంగ్ దళ్ కార్యకర్తలు పార్కుల వద్ద కనపడుతోన్న ప్రేమికులను బెదరగొడుతున్నారు. వారు వస్తున్నారని తెలుసుకుంటోన్న ప్రేమ జంటలు అక్కడి నుంచి పరుగులు తీశారు.

పలుచోట్ల ఈ ఘటనలకు సంబంధించిన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. ప్రేమికులను బెదరగొట్టడమే కాకుండా చెన్నైలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డుపై కుక్కకి, గాడిదకి పెళ్లి చేసి, డప్పు కొట్టారు. కాగా, భజరంగ్ దళ్‌, విశ్వహిందూ పరిషత్ నాయకులు హైదరాబాద్‌లోని అబిడ్స్ లో ప్రేమికుల దిష్టిబొమ్మను దహనం చేశారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పెడదారి పట్టొద్దని చెప్పారు.  
Hyderabad
chennai
walantance day

More Telugu News