priya prakash: ప్రియా ప్రకాశ్ వీడియో హిట్ కావడం ప్రేమికుల రోజును నిరసించే వారికి ఒక సమాధానం: జిగ్నేష్‌ మేవానీ

  • సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఆమె వీడియోలు
  • ఇది ఆరెస్సెస్‌కు ఒక సమాధానం- జిగ్నేష్
  • ఒకరిని ద్వేషించడం కన్నా ప్రేమించడాన్ని అధికంగా ఇష్టపడతామని భారతీయులు మరోసారి రుజువు చేశారు
  • ప్రేమికుల రోజున హిందూ సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో వ్యాఖ్యలు
'ఒరు అదార్ లవ్' మూవీలోని ఓ సాంగ్‌లో కనపడి కన్ను గీటుతూ, అందంగా హావభావాలు కనబరుస్తూ మలయాళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్ అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను ఉపయోగిస్తూ విపరీతంగా జోక్స్, సెటైర్లు వేస్తూ పోస్టులు పెడుతున్నారు. చివరికి ఆమె వైరల్ వీడియోను గుజరాత్‌ దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీ కూడా తన ప్రత్యర్థులను విమర్శించేందుకు ఉపయోగించుకున్నారు.

ఈ వీడియో హిట్ కావడం ప్రేమికుల రోజును నిరసించే ఆరెస్సెస్‌కు ఒక సమాధానమని తెలిపారు. ఒకరిని ద్వేషించడం కన్నా ప్రేమించడాన్ని అధికంగా ఇష్టపడతామని భారతీయులు మరోసారి రుజువు చేశారని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ రోజు ప్రేమ జంటలు కనపడితే బలవంతంగా పెళ్లిళ్లు చేస్తామని హిందూ సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
priya prakash
jignesh mevani
Viral Videos

More Telugu News