Revanth Reddy: కోదండరామ్ తో భేటీ అయిన రేవంత్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ను కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి కలిశారు. ఆయన నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన నివాసంలో జరిగే శుభకార్యానికి రావాల్సిందిగా కోదండరామ్ ను ఆహ్వానించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా వీరి మధ్య చర్చ జరిగింది.

త్వరలోనే కోదండరామ్ ఓ రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. వీరి భేటీకి సంబంధించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా కూడా తెలిపారు. కోదండరామ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యానని ఆయన ట్వీట్ చేశారు. భేటీకి సంబంధించిన ఫొటోను అప్ లోడ్ చేశారు.  
Go Back to Shorts
Revanth Reddy
Kodandaram

More Telugu News