mudragada padmanabham: పవన్ కల్యాణ్ విషయంలో ఇలా చేయడం న్యాయమా?: చంద్రబాబుకు ముద్రగడ బహిరంగ లేఖ
- ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పవన్ పై పెట్టారు
- బీజేపీని ఆయనతో తిట్టించారు
- హోదా కోసం ఉద్యమించాల్సింది టీడీపీనే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. 'ప్రత్యేక హోదా ఉద్యమాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పెట్టారు... మీ పరపతిని కాపాడుకోవడం కోసం ఇలా చేయడం న్యాయమా?' అని ఆ లేఖలో ప్రశ్నించారు. బీజేపీని పవన్ కల్యాణ్ చేత తిట్టించి... జాతీయ పార్టీకి ఆయనను దూరం చేశారని అన్నారు.
విభజన చట్టాల హామీలను అమలు చేయించడానికి పవన్ కానీ, జగన్ కానీ, తాను కానీ ఏమాత్రం సరిపోమని చెప్పారు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీనే కేంద్రంపై పోరాడాలని అన్నారు. 1984లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెరవెనుక రాజకీయాలు ఎలా చేశారో... ఇప్పుడు కూడా అలాగే చేసి హోదా కోసం ఉద్యమించాలని కోరారు. ఉద్యమాలకు సంబంధించి చంద్రబాబుకు మించిన అనుభవశాలి ఈ రాష్ట్రంలో మరెవరూ లేరని చెప్పారు.