meera jasmine: ఎంతో క్యూట్ గా ఉండే మీరా జాస్మిన్.. ఇప్పుడెలా ఉందో చూడండి!

  • పెళ్లి తర్వాత టాలీవుడ్ కు దూరమైన మీరా
  • 2016 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం
  • బొద్దుగా తయారైన మీరా
దక్షిణాదిన అన్ని భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. తెలుగులో 'గుడుంబా శంకర్', 'భద్ర', 'అమ్మాయి బాగుంది' లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. 2014లో పెళ్లి చేసుకున్న ఆమె... తెలుగులో నటించడం మానేసింది. పెళ్లి తర్వాత కొన్ని మలయాళ సినిమాల్లో నటించింది. 2016 తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు దూరమైంది. తాజాగా ఆమె ఓ జువెలరీ షాప్ లో తళుక్కుమంది. హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎంతో నాజూకుగా ఉన్న మీరా... ఇప్పుడు చాలా బొద్దుగా మారిపోయింది. అయినప్పటికీ చీర కట్టులో ఎంతో హుందాగా, అందంగా కనిపించింది. ప్రస్తుతం ఆమె తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
meera jasmine
tollywood
fresh look

More Telugu News