amaravati: అమరావతిలో చంద్రబాబుతో ముఖేష్ అంబానీ భేటీ ప్రారంభం

  • రియల్ టైమ్స్ గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించిన ముఖేష్ అంబాని
  • ఏపీలో పెట్టుబడులపై చంద్రబాబుతో చర్చ
  • సచివాలయంలో కొనసాగుతోన్న సమావేశం
రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబాని ముంబయి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుని, అక్కడి నుంచి అమరావతికి వచ్చి సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. తన పర్యటనలో భాగంగా చంద్రబాబుతో కలిసి రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఆయన చంద్రబాబుతో పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తమ సంస్థ పెట్టాలనుకుంటోన్న పెట్టుబడులపై ముఖేష్ అంబాని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు మౌలిక సదుపాయాలపై చంద్రబాబు వివరిస్తున్నట్లు సమాచారం. 
amaravati
Chandrababu
mukhesh ambani

More Telugu News