Medaram: 824 గ్రాముల బంగారం, 47 కిలోల వెండి, 32 దేశాల కరెన్సీ... సమ్మక్క, సారలమ్మలకు భక్తుల కానుకలు!

  • గద్దెనెక్కిన అమ్మలకు భారీగా కానుకలు
  • వారం రోజుల పాటు కొనసాగిన లెక్కింపు
  • రూ. 10 కోట్లు దాటిన ఆదాయం
ఈనెలారంభంలో జరిగిన మేడారం సమ్మక్క, సారక్క జాతరలో భక్తులు అమ్మవార్లకు భారీగా కానుకలు సమర్పించుకున్నారు. మొత్తం 479 హుండీలను మేడారం గద్దెల ప్రాంతాల్లో ఏర్పాటు చేయగా, హుండీల ద్వారా రూ. 10,17,50,363 ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.

హుండీలను తెరిచి గడచిన వారం రోజులుగా హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో లెక్కించిన అధికారులు, తుది గణాంకాలను విడుదల చేశారు. నగదుతో పాటు 824 గ్రాముల బంగారం, 47.470 కిలోల వెండి ఆభరణాలను భక్తులు అమ్మవార్లకు కానుకలుగా ఇచ్చారని వెల్లడించారు. 32 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు కూడా హుండీల్లో లభించాయని, వీటిని మార్పిడి నిమిత్తం రిజర్వ్ బ్యాంకుకు పంపుతామని మేడారం గద్దెల ఈఓ రమేష్ బాబు వెల్లడించారు.
Medaram
Sammakka
Sarakka
Jatara
Hundi
Revenue

More Telugu News