Accident: నెత్తురోడిన రహదారి... శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం, ఐదుగురి మృతి

  • ఆటోను ఢీకొన్న టిప్పర్
  • ముగ్గురికి తీవ్రగాయాలు
  • మృతుల్లో పాలకొల్లు వాసులు
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తికి మహాశివరాత్రి నిమిత్తం వచ్చిన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

బీఎన్ కండక్రిగ మండలం మయూర షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఉదయం ఘటన జరిగింది. మృతులు పాలకొల్లుకు చెందిన రామారావు, కుమారి, పీలేరుకు చెందిన బిందు, అనంత్, ఆటోడ్రైవర్ రమణలుగా గుర్తించారు. ఇదిలావుండగా, హైదరాబాద్ మియాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో డివైడర్ ను ఓ కారు ఢీకొనగా ఇద్దరు మరణించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లిలో బైక్ ను ట్రాక్టర్ ఢీకొనగా ఓ యువకుడు మృతి చెందాడు.
Accident
Chittoor District
Srikalahasti
Hyderabad
Miyapur

More Telugu News