Telangana: నల్గొండ జిల్లాలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్య.. గ్రామంలో ఉద్రిక్తత!

  • మంచం కింద బాంబు పెట్టిన దుండగులు
  • చెల్లాచెదురైన శరీర భాగాలు
  • పాతకక్షలే కారణమన్న పోలీసులు
నల్గొండ జిల్లా మునిసిపల్ చైర్‌పర్సన్ భర్త, కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యను మర్చిపోకముందే జిల్లాలో మరో కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని తిరుమలగిరి మండలం, చింతలపాలెం గ్రామ ఉప సర్పంచ్, కాంగ్రెస్ నేత ధర్మానాయక్‌‌ను దుండగులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ధర్మానాయక్ నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఆయన మంచం కింద బాంబు పెట్టి పేల్చారు. దీంతో ధర్మానాయక్ శరీర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి.
 
ధర్మానాయక్ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్మానాయక్ హత్యకు పాత కక్షలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
Congress
Murder
Nalgonda

More Telugu News