ashok gajapati raju: బ‌డ్జెట్‌పై స్పందించడానికి నిరాకరించిన అశోక్ గజపతి రాజు

  • విజయనగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ గజపతి రాజు
  • ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కేంద్ర, రాష్ట్ర కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి
  • భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్ల రద్దు అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి నేనే సలహా ఇచ్చా
  • ప్రతిపక్ష పార్టీల నేతల ఆరోపణలు అసత్యం
ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై టీడీపీ నేతలు అందరూ స్పందిస్తూ మండిపడుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు విజయనగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ.. దీనిపై స్పందించబోనని, దానిపై మాట్లాడడానికి ఇది సందర్భం కాదని అన్నారు.

ప్రస్తుతం కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కేంద్ర, రాష్ట్ర కమిటీలు కూడా అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు. కాగా, భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్ల రద్దు అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి తానే సలహా ఇచ్చానని అన్నారు. దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతల ఆరోపణలు అసత్యమని అన్నారు.
ashok gajapati raju
Union Budget 2018-19
no comment

More Telugu News