Undavalli: చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం: ఉండవల్లితో భేటీ తరువాత జేపీ

  • రాజకీయ పరిణామాలు, నిజనిర్ధారణ కమిటీ విధివిధానాలపై చర్చ
  • ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప రాష్ట్రానికి వచ్చిందేమీ లేదు
  • నాలుగేళ్లయినా రాష్ట్రానికి రావాల్సినవి ఏవీ రాలేదు
హైదరాబాద్ బేగంపేటలోని లోక్‌సత్తా కార్యాలయంలో జయప్రకాశ్ నారాయణతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జయప్రకాశ్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, నిజనిర్ధారణ కమిటీ విధివిధానాలపై చర్చించామని తెలిపారు.

మన హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, మేధావులు, అందరి ఆలోచనలు తెలుసుకోవాలని అన్నారు. ఏపీలో ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని చెప్పారు. నాలుగేళ్లయినా రాష్ట్రానికి రావాల్సినవి ఏవీ రాలేదని , తాము చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని చెప్పారు. 
Undavalli
Union Budget 2018-19
Jayaprakash Narayan
Hyderabad

More Telugu News