jubilee hills: జూబ్లీ హిల్స్ లో ఇంటి నిర్మాణం కోసం జిలెటిన్ స్టిక్స్ వాడుతుండగా.. భారీ పేలుడు!

  • రోడ్డు నంబర్ 48లో ఘటన
  • పారిశ్రామికవేత్త ఇంటి నిర్మాణం కోసం పేలుళ్లు
  • భయంతో పరుగులు తీసిన స్థానికులు
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో భారీ పేలుడు సంభవించింది. రోడ్డు నెంబర్ 48లో ఓ పారిశ్రామికవేత్త ఇంటి నిర్మాణం కోసం జిలెటిన్ స్టిక్స్ తో పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లకు పాత భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సందర్భంగా భారీ శబ్దం రావడంతో, చుట్టుపక్కలవారు భయంతో పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక, తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ కూడా తనిఖీలను నిర్వహిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
jubilee hills
blast

More Telugu News