rss: మిస్టర్ భగవత్, మీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: ఆర్ఎస్ఎస్ చీఫ్ పై రాహుల్ గాంధీ మండిపాటు

  • ప్రతీ భారతీయుడికీ అవమానకరం
  • దేశం కోసం ప్రాణాలు విడిచిన వారికి అగౌరవం
  • ట్విట్టర్ లో మోహన్ భగవత్ పై రాహుల్ ఆగ్రహం
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భారత ఆర్మీపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడే విధంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ‘‘మీ వ్యాఖ్యలకు సిగ్గు పడాలి’ అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగం ప్రతీ భారతీయుడికీ అవమానకరంగా ఉందన్నారు. భారత జాతి కోసం ప్రాణాలు అర్పించిన వారిని అగౌరవపరిచేలా ఉన్నాయని ఆరోపించారు.

ప్రతీ జవాను సెల్యూట్ చేసిన భారత పతాకాన్ని అవమానించేలా వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. సందర్భం వస్తే దేశం కోసం పోరాడేందుకు ఆర్మీని మూడు రోజుల్లోనే ఆర్ఎస్ఎస్ సిద్ధం చేయగలదని భగవత్ చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణమయ్యాయి. ‘‘సంఘ్ మూడు రోజుల్లోనే మిలటరీని సన్నద్ధం చేయగలదు. అదే ఆర్మీకి అయితే 6-7 నెలలు పడుతుంది. ఇది మా సామర్థ్యం’’ అంటూ భగవత్ పేర్కొన్నారు.
rss
bhagavath
Rahul Gandhi

More Telugu News