chandra siddharth: హైపర్ ఆది .. చమ్మక్ చంద్రల సినిమా పూర్తి

  • హైపర్ ఆది .. చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రలు 
  • మిగతా వాళ్లంతా కొత్త నటీనటులు 
  • త్వరలోనే ప్రమోషన్స్ మొదలు
దర్శకుడిగా చంద్ర సిద్ధార్థ్ కి ప్రత్యేకమైన ముద్ర వుంది. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ఆయన వెళుతుంటారు. ఆయన తెరకెక్కించిన 'ఆ నలుగురు' .. 'మధుమాసం' .. 'అందరి బంధువయా' చిత్రాలే అందుకు నిదర్శనం.

తాజాగా ఆయన 'జబర్దస్త్' తో క్రేజ్ తెచ్చుకున్న హైపర్ ఆది .. చమ్మక్ చంద్రలతో ఒక సినిమా చేశారు. షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాకి 'ఆటగదరా శివ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. హైపర్ ఆది .. చమ్మక్ చంద్ర మినహా మిగతా వాళ్లంతా కొత్త నటీనటులని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు.   
chandra siddharth

More Telugu News