Mahesh Babu: ఫారిన్ షూటింగ్ కి రెడీ అవుతోన్న మహేశ్ బాబు

  • షూటింగు దశలో 'భరత్ అనే నేను'
  • తదుపరి షెడ్యూల్ పూణెలో 
  • చివరి షెడ్యూల్ విదేశాల్లో
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా 'భరత్ అనే నేను' సినిమా రూపొందుతోంది. కైరా అద్వాని కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. అందువలన షూటింగుకి సంబంధించిన పనుల్లోనూ .. పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన పనుల్లోను వేగాన్ని పెంచారట.

మహేశ్ బాబు .. షాట్ .. షాట్ కి మధ్య గ్యాప్ కూడా ఎక్కువగా తీసుకోకుండా చకచకా కానిచ్చేస్తున్నాడని అంటున్నారు. అంతేకాదు యూనిట్ సభ్యులందరిలోను ఆయన ఉత్సాహాన్ని నింపుతున్నాడని చెబుతున్నారు. తదుపరి షెడ్యూల్ ను పూణెలో పూర్తి చేసి, ఆ తరువాత షెడ్యూల్ ను ఫారిన్ లో జరుపుతారట. 16 రోజులపాటు జరిగే ఆ చివరి షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు.  
Mahesh Babu
kiara adwani

More Telugu News