ప్రొఫెసర్ కోదండరామ్ కు తప్పిన ప్రమాదం

షార్ట్స్‌లో చూడండి
టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం ప్రమాదానికి గురైంది. బైక్ ను తప్పించబోయే క్రమంలో డివైడర్ ను ఆయన వాహనం ఢీకొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. కోదండరామ్ కాలి బొటనవేలికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. గాయపడ్డ యువకులను సమీప ఆసుపత్రికి తరలించారు. మరో వాహనంలో కోదండరామ్ హైదరాబాద్ బయలుదేరినట్టు సమాచారం.

కాగా, నల్గొండ పట్టణంలో విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘నాలుగేళ్ల పాలనలో నల్గొండ జిల్లా అభివృద్ధి’ అనే కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కోదండరామ్ తిరిగి హైదరబాద్ వస్తుండగా ఈరోజు సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. 
Go Back to Shorts
kodanaram
accident

More Telugu News